AP: సీఎం చంద్రబాబు సోమవారం 175 నియోజకవర్గాల యాక్షన్ ప్లాన్ కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 14న అన్నదాత సుఖీభవ ఇస్తామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం మహిళలకు అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. అలాగే ఎమ్మెల్యేలు మనసుపెట్టి శ్రద్ధగా పనిచేయాలని, పొలిటికల్ గవర్నెన్స్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు.