అన్నదాత సుఖీభవ.. ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి

73చూసినవారు
అన్నదాత సుఖీభవ.. ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి
AP: జూన్ 12వ తేదీన అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద రైతులకు రూ.20,000 ఆర్థిక సాయం అందిస్తారు. ఈ పథకానికి ఏపీకి చెందిన 18 ఏళ్లు నిండిన రైతులు అర్హులు. ఈ పథకం లబ్ధి పొందడానికి భూమి యాజమాన్య పత్రాలు లేదా పట్టాదారు పాసుపుస్తకం అవసరం. రైతు పేరు ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయాలి. అలాగే ఆధార్ కార్డుతో అనుసంధానమైన బ్యాంక్ ఖాతా ఉండాలి. కౌలు రైతులకు కౌలు రైతు ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.

సంబంధిత పోస్ట్