భవనం నిర్మాణాలను కూల్చివేసిన వ్యర్ధాలను ఎక్కడంటే అక్కడ పడేస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి గురువారం హెచ్చరించారు. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఇలాంటి వేస్ట్ మెటీరియల్ అంతా సీమాంక్ ఆసుపత్రి సమీపంలోని కుంట వద్ద వేయవచ్చని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వీటిని రహదారుల పక్కన పోస్తే ట్రిప్పుకు రూ. 2000 చొప్పున ఫైన్ వేస్తామని హెచ్చరించారు.