బద్వేలు పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద అర్బన్ సీఐ రాజగోపాల్, ఎస్సై రవికుమార్ లు శుక్రవారం సాయంత్రం వాహనాల తనిఖీ నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్, త్రిబుల్ రైడింగ్, మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడిపే వారికి, మరియు వాహనాలకు సంబంధించిన పత్రాలు సరిగా లేని వాహనదారులకు జరిమానా విధించారు. వాహనదారులు ప్రతి ఒక్కరు పోలీసు నిబంధనలు పాటిస్తూ అతివేగాన్ని తగ్గించి వాహనాలు నడపాలని సీఐ రాజగోపాల్ సూచించారు.