బద్వేల్ పట్టణంలోని ఏపీ ఎన్జీవో కార్యాలయంలో అధ్యక్షుడు అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. తాలూకాలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించామన్నారు. జిపిఎస్, ఎపిజిఎస్ఐ, సరెండర్ లీవులు, డిఏ అరియర్స్ మొదలైనవి వెంటనే చెల్లించాలని అధ్యక్ష కార్యదర్శులు అమర్నాథరెడ్డి, నరసింహారెడ్డి సభను ఉద్దేశించి ప్రసంగించారు. వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి మల్లికార్జున, మధుసూదన్ పాల్గొన్నారు.