బద్వేలు నియోజకవర్గ టిడిపి యువనేత చెరుకూరి రవికుమార్ సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. అమరావతిలోని సచివాలయంలో ఆయన సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. పలు అభివృద్ధి పనులపై వినతి పత్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేశారు.