బద్వేల్ నియోజకవర్గం కలసపాడు ఐటిఐ కాలేజీ సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు కలసపాడు నుంచి వస్తున్న స్కూటర్ ను బొలొరో వాహనం డీ కొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. 108 సహాయంతో మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.