ప్రతి వాహనాదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని బద్వేల్ సిఐ రాజగోపాల్ అన్నారు. శనివారం బద్వేలు పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు యాక్సిడెంట్ కు గురైనప్పుడు వారు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నవిఅని అన్నారు. మీరు మీ ప్రాణాలను కాపాడుకొనుటకు ఖచ్చితంగా హెల్మెట్స్ ను ధరించాలన్నారు. ఎవరైనా హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే వారిపై చర్యలు తీసుకోబడతాయన్నారు.