బద్వేల్: ఎర్రచందనం కేసులో ఐదేళ్ల జైలు శిక్ష

75చూసినవారు
బద్వేల్: ఎర్రచందనం కేసులో ఐదేళ్ల జైలు శిక్ష
బద్వేల్ రేంజ్ లోని లోతువంక బీటులో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ యాటగిరి వీర భాస్కర్ కు తిరుపతి కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 6 లక్షల జరిమానా విధించింది. ఈ విషయాన్ని బద్వేల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నయీమ్ అలీశుక్రవారం తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా సిద్దవటం మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ 2018 - 19లో స్మగ్లింగ్ చేసిన నేరం నిరూపణ కావడంతో జడ్జి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.

సంబంధిత పోస్ట్