బద్వేలు నియోజకవర్గంలోని కాశినాయన మండలం రామచంద్రాపురం వద్ద మంగళవారం లారీ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాజా అక్కడికక్కడే మృతి చెందాడు. మార్కాపురం నుంచి సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.