కడప జిల్లా అటవీ అధికారి వినీత్ కుమార్ ను బద్వేల్ నియోజకవర్గ ఇన్ చార్జ్ రితేష్ రెడ్డి, బొజ్జ రోషన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంగళవారం అవధూత కాశినాయన స్వామి దేవస్థానం ప్రాంతానికి సంబంధించిన ఫారెస్ట్ క్లియరెన్స్, అలాగే రాబోయే మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా లంకమల్ల శ్రీ రామలింగేశ్వర దేవస్థానాలకు వెళ్లే రహదారుల మరమ్మత్తుల అనుమతులపై చర్చించారు.