బద్వేలు నియోజకవర్గ భారత కమ్యూనిస్టు పార్టీ ఎంఎల్ లిబరేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు బద్వేలు కమిషనర్ నరసింహారెడ్డిని మంగళవారం కలిశారు. బద్వేల్ మున్సిపల్ పరిధిలో 70కి పైగా సర్వే నెంబర్ లోని ఆక్రమణకు గురైన పబ్లిక్ పర్పస్ స్థలాలు, రస్తాలను స్వాధీనం చేసుకోవాలని కోరారు. అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఈ మేరకు కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.