బద్వేల్: జాతరను కలిసికట్టుగా జరుపుకోవాలి

60చూసినవారు
బద్వేల్: జాతరను కలిసికట్టుగా జరుపుకోవాలి
బద్వేల్ మండలం గొడుగునూరు గ్రామం నందు ఈ నెల 18వ తేదీ జరగబోయే పోలేరమ్మ జాతర ప్రజలందరూ కలిసికట్టుగా జరుపుకోవాలని బద్వేల్ రూరల్ సిఐ నాగభూషణ్, ఎస్ఐ శ్రీకాంత్ అన్నారు. శనివారం గొడుగునూరు గ్రామంలో ప్రజలతో సభ ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలంతా విభేదాలన్నీ పక్కనపెట్టి కలిసికట్టుగా జాతర జరుపుకోవాలని, శాంతి భద్రతల సమస్య రాకుండా చూసుకోవాలని గ్రామ పెద్దలకు సూచించారు.