చక్రాయపేట: గండిలో 19 నుంచి హనుమజ్జయంతి ఉత్సవాలు

84చూసినవారు
చక్రాయపేట మండలం గండి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు శనివారం ఆలయ అసిస్టెంట్ కమీషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. 4 రోజుల పాటు అభిషేకంతో పాటు తదితర విశేష పూజలు నిర్వహిస్తున్నామన్నారు. ఆలయ అర్చకులు కేసరి స్వామి, రాజా స్వాముల నేతృత్వంలో వేద మంత్రోచ్ఛారణాలతో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్