బద్వేలు పట్టణంలో జరుగు పారిశుధ్య పనుల పరిశీలనలో భాగంగా.. సిద్ధవటం రోడ్డులోని విద్యానగర్ లో రెండు షాప్ లకు బయట చెత్త వేస్తున్నారని తెలిసి రెండు షాపులకు జరిమానా విధించినట్లు మున్సిపల్ కమిషనర్ వివి. నరసింహారెడ్డి తెలిపారు. షాప్ ల బయట చెత్త వేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. చెత్తసేకరణ వాహనాల్లో మాత్రమే షాప్ లలోని చెత్తవేసి పట్టణ పరిశుభ్రతకి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని కోరారు