గోపవరం మండలంలోని కాలువపల్లె గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు రామయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఆయన పార్థివ దేహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబసభ్యులతో మాట్లాడుతూ. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఆయనతోపాటు పలువురు నాయకులు పాల్గొని నివాళులర్పించారు.