పోరుమామిళ్ల లో అక్టోబర్ నెల ఒకటో తేదీ నుంచి 31 వ తేదీ వరకు సర్కిల్ పరిధిలో సెక్షన్ 30 పోలీసు యాక్టు అమలులో ఉంటుందని గురువారం సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటే 24 గంటల ముందు లిఖితపూర్వకంగా పోలీసు వారికి అర్జీ ఇచ్చి వారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా కార్యక్రమాలు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.