బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండల పరిధిలోని ఎంఐజి లేఔట్ ను గురువారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ సందర్శించి పరిశీలించారు. ఎంఐజి లేఔట్ లో భూములు కోల్పోయిన వారికి ఆ సైన్ మెంట్ ద్వారా కేటాయించిన భూములను పరిశీలించారు. ప్రాజెక్టు కాలనీ-2లో రేషన్ షాపును తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రమోహన్, కుడా సెక్రెటరీ శిరీష, త్రిభువన్ రెడ్డి గోపవరం తహసిల్దార్ పాల్గొన్నారు.