కలసపాడు మండలంలోని తెల్లపాడు గ్రామపంచాయతీలోని దూలంవారిపల్లెకి చెందిన ఒద్దేపోగు యశ్వంత్ అనే యువకుడు తెలంగాణలో గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం సాధించినట్లు శనివారం ఆయన తండ్రి ఒద్దేపోగు యోహాను తెలిపారు. ఆయన మాట్లాడుతూ పేద కుటుంబంలో జన్మించి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఆనందంగా ఉందన్నారు. స్నేహితులు, బంధువులు అతడిని అభినందించారు.