కడప జిల్లా బద్వేలు ఆర్టీసీ డీఎంగా ఆర్సీ నిరంజన్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ ఇన్ ఛార్జి డీఎంగా ఉన్న కన్యాకుమారి కడప ఆర్టీసీకి బదిలీ అయ్యారు. దీంతో అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్టీసీ డీఎంగా పనిచేస్తున్న నిరంజన్ బద్వేలుకు బదిలీ అయ్యారు. త్వరలోనే ఆయన బాధ్యతలు చేపట్టనున్నారని అధికారులు తెలిపారు.