బద్వేలు నుంచి హైదరాబాద్ కు ఆర్టీసీ బస్సు సర్వీస్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. శనివారం ఆయన తెలుపుతూ సర్వీస్ నంబర్ 6202 గల బస్సు బద్వేలు నుంచి రాత్రి 8. 30కు బయలుదేరి హైదరాబాద్ కు ఉదయం 6. 20కి చేరుకుంటుదని అన్నారు. సర్వీస్ నంబర్ 6203 బస్సు హైదరాబాదులో రాత్రి 8. 45కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6. 15 గంటలకు బద్వేలుకు చేరుకుంటుందని తెలిపారు. ప్రయాణికులు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.