పదేళ్ల క్రితం కలసపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ పంద్యాల వెంకట లక్ష్మమ్మ (38)ను ఇబ్బంది పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసిన ఆరుగురికి శిక్ష పడిందని శనివారం ఎస్సై తెలిపారు. ఆ కేసు విషయంలో విచారణ జరిపిన బద్వేలు కోర్టు ఆధారాలు నిరూపితం కావడంతో ఆరుగురికి మూడేళ్ల జైలు శిక్ష, రూ. 500 జరిమానా విధిస్తూ జడ్జి పద్మశ్రీ శుక్రవారం తీర్పు ఇచ్చారని, కలసపాడు ఎస్సై చిరంజీవి తెలిపారు.