ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు రసీదులు తప్పనిసరిగా ఇవ్వాలని బద్వేల్ సహాయ వ్యవసాయ సంచాలకుడు ఎం. నాగరాజ తెలిపారు. గరిష్ఠ అమ్మకపు ధరకు లోబడే విక్రయించాలన్నారు. బద్వేల్, గోపవరం మండలాల్లోని ఫర్టిలైజర్ దుకాణాల్లో శనివారం ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎరువులు, విత్తనాల నిల్వలు, పురుగు మందుల స్టాక్ ను పరిశీలించారు. బిల్ బుక్స్, స్టాక్, ధరల ప్రదర్శన బోర్డును సక్రమంగా నిర్వహించాలని డీలర్లకు సూచించారు.