ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

71చూసినవారు
ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
యర్రగుంట్ల మండలం చిలంకూరు వద్ద ఐసీఎల్ ఫ్యాక్టరీలో గురువారం సాయంత్రం డ్రిల్లింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు రామాంజి(41) మృతి చెందాడు. మృతుడు ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్