కడప జిల్లా బ్రహ్మం గారి మఠం మండల టౌన్ పరిధిలోని కొత్తూరు గ్రామంలో సీసీ రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని శుక్రవారం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోడ్డులో నిత్యం ఎంతోమంది ప్రజాప్రతినిధులు పోతున్నారు వస్తున్నారు. ఈ రోడ్డులో నిత్యం నీళ్లు పారుతూనే ఉన్నాయి. కనీసం అధికారులు పట్టించుకోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు తమ వీధికి రోడ్డు వేయాలని కోరుతున్నారు.