పెద్దముడియం పోలీస్ స్టేషన్ లో వరకట్నం కేసులో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు మంగళవారం ఎస్ఐ సుబ్బారావు తెలిపారు. అదనపు కట్నం తీసుకురావాలంటూ గత కొంతకాలంగా మానసికంగా, శారీరకంగా తన భర్త, అత్త, మామ, ఆడపడుచులు వేధింపులకు గురిచేస్తూ ఇబ్బంది పెడుతున్నారంటూ పెద్దముడియం మండలం కొండసుంకేసులకు చెందిన మేడగం స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.