జమ్మలమడుగు పట్టణంలోని 19వ వార్డు పరిధిలోని ఎత్తపు కాలనీకి వెళ్లే దారిలో రోడ్డు మధ్యలో గుంతలు ప్రమాదకరంగా ఉన్నాయని ఆ కాలనీవాసులు వాపోతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో రోడ్డుమీద గుంతలలో పడి ద్విచక్ర వాహనదారులు దారిలో వెళ్లే ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికే చాలా మంది గాయపడ్డారని దీనిపైన అధికారులు చర్యలు తీసుకొని ప్రమాదకరంగా ఉన్న గుంతలను మూసివేయాలని కోరుతున్నారు.