కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని చారిత్రాత్మక గండికోటను కేంద్రమంత్రి జితేందర్ సింగ్ సందర్శించారు. కోటలోని అనేక చారిత్రాత్మక కట్టడాలను అలాగే శుక్రవారం సూర్యోదయంను పరిశీలించారు. చివరగా పెన్నా నదిలోయను సందర్శించి మంత్రముగ్ధులయ్యారు. అనంతరం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యకలాపాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.