ఎర్రగుంట్ల ఆర్టిపిటిలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో సమాన పనికి సమాన వేతనం ఇస్తానంటూ హామీ ఇచ్చారని ఆ హామీ మేరకు యాజమాన్యంతో చర్చించి జీవో నెంబర్ 129 ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించినందుకు హర్షం వ్యక్తం చేశారు. గత 10సంవత్సరాలుగా ఆర్టీపీలో చాలి చాలని జీతాలతో పనిచేశామని తెలిపారు.