కొండాపురంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ బి. కృష్ణవేణమ్మ తెలిపారు. ఇంగ్లీష్ మీడియంలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశానికి మార్చి 6లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలని, ఏప్రిల్ 6న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.