జమ్మలమడుగులోని పురాతన శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అంగరంగ వైభవంగా రథోత్సవం కన్నుల పండుగలా జరిగింది. వేలాది మంది భక్తులు రథోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. జమ్మలమడుగు డీస్పీ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సి. ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డి, టీటీడీ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.