మీడియాలో వచ్చిన వరుస కథనాలతోపాటు అనకాపల్లి ఎంపీ, సీఎం రమేష్ ఫిర్యాదు నేపథ్యంలో జమ్మలమడుగులో రిపబ్లిక్ క్లబ్‌ను బుధవారం పోలీసులు మూసివేశారు. ఇటీవల ఉదయం నుంచి అర్థరాత్రి వరకు అనాధికారికంగా పేకాట నిర్వహిస్తున్నట్లు విమర్శలతో డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం క్లబ్‌లో విస్తృత తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. ఆ తర్వాత క్లబ్‌ను పోలీసులు మూసివేయాలని నిర్ణయించినట్లు సమాచారం.