చెన్నూరు: అసంపూర్తిగా ఉన్న జాతీయ రహదారి పనులను పూర్తి చేయాలి

66చూసినవారు
చెన్నూరు: అసంపూర్తిగా ఉన్న జాతీయ రహదారి పనులను పూర్తి చేయాలి
కడప - కర్నూలు ప్రధాన జాతీయ రహదారి విస్తరణ పనుల్లో అసంపూర్తిగా మిగిలిపోయిన చెన్నూరు మండల పరిధిలోని పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంపీటీసీలు కోరారు. శనివారం చెన్నూరు ఎంపీడీవో కార్యాలయ సభా భవనంలో ఎంపీపీ చీర్ల సురేశ్ యాదవ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్