కడప జిల్లాలో ఉపాధి పనుల్లో అవకతవకలపై కలెక్టర్ శ్రీధర్ దృష్టి సారించారు. ఉపాధి హామీ నిధులను పక్కదారి మళ్లిస్తున్నారని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో శుక్రవారం చక్రాయపేట మండలాల్లో కలెక్టర్ పర్యటించారు. ఉపాధి పనుల కల్పన, కూలీ చెల్లింపు, ఇతర మౌళిక సదుపాయాలపై కూలీలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు రుజువైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.