యోగి వేమన యూనివర్సిటీ వసతి గృహాలలో నాణ్యమైన భోజన, ఆహార పదార్థాలు విద్యార్థులకు ఇస్తున్నట్లు గుర్తించి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్టిఫికెట్ లభించింది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వీసీ కృష్ణారెడ్డి వైవీయూ కళాశాల ప్రిన్సిపాల్, విశ్వవిద్యాలయ వసతి గృహాల చీఫ్ వార్డెన్ రఘునాథరెడ్డికి.. గురువారం ఆంధ్రప్రదేశ్ రూకో ప్రాజెక్ట్ హెడ్ అల్లూరి సంపత్ కుమార్ ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికెట్ ను అందజేశారు.