రాష్ట్ర హోంశాఖా మంత్రి అనిత ఈ నెల 18వ తేదీ ఆదివారం కడప నగరానికి రానున్నారు. ఆమె హైదరాబాద్ నుంచి ఆదివారం కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు నగర శివార్లలోని పబ్బాపురంలో మహానాడు నిర్వహించే ప్రాంగణాన్ని పరిశీలిస్తారు. పోలీసు అధికారులతో సమీక్షిస్తారు. తిరిగి కడపలోని రాష్ట్ర అతిథి గృహానికి చేరుకుని స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు పేర్కొన్నారు.