ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడంతో కడప జిల్లా బిజెపి అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని వాజ్ పేయి కూడలిలో శనివారం బిజెపి నాయకులు సంబరాలు జరుపుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీని బిజెపి ఎన్నికల్లో కైవసం చేసుకొందని హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సుపరిపాలన చూసి, ఢిల్లీ వాసులు బిజెపికి పట్టం కట్టారు అని చెప్పారు.