కడప నగర శివారులోని రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధి పాలకొండల జంక్షన్ దగ్గర శుక్రవారం పోలీసులు నిర్వహించిన తనిఖీలో సుమారు రూ. ముప్పై వేల విలువగల 6 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శివమణి అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.