షెడ్యుల్ కులాలలోని ఉప వర్గీకరణపై విజ్ఞప్తులను స్వీకరించి విచారణ చేయడానికి ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమీషన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు శుక్రవారం కడపలోని స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద ఘన స్వాగతం లభించింది. శుక్రవారం ఉదయం కర్నూలు నుండి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి ఉదయం 10. 20 గంటలకు స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్ కు చేరుకున్న ఆయనకు డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు.