కడప: ‘ఉపాధి’లో అవకతవకలకు పాల్పడితే చర్యలు – కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి

76చూసినవారు
కడప: ‘ఉపాధి’లో అవకతవకలకు పాల్పడితే చర్యలు – కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి
వేంపల్లె జాతీయ ఉపాధి హమీ చట్టం పనుల్లో అవకతవకలకు పాల్పడితే సిబ్బంది, అధికారులపై చర్యలు తప్పవని జిల్లా శ్రీధర్‌ చెరుకూరి అన్నారు. జిల్లాలో జరుగుతున్న ఉపాధి పనుల్లో అవినీతి జరుగుతున్నదని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఇటివల కలెక్టర్‌కు పిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వేంపల్లె పంచాయతీ పరిధిలోని రాజీవ్‌ నగర్‌ కాలనీలో సమీపంలో జరుగుతున్న ఉపాధి పనులను కలెక్టర్‌ తనీఖీ చేశారు. అలాగే కూలీలతో పనులు, సౌకర్యాలు, బిల్లులు చెల్లింపుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హమీ చట్టం కింద ఉద్యానవన పంటలను సాగు చేసిన నిమ్మ, చీనీ పంటలను కూడా పరిశీలించి రైతుల ద్వారా బిల్లులు చెల్లింపులు, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్