కడప జిల్లా జోన్-4 పరిధిలో 150 స్టాఫ్ నర్సు పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజనల్ డైరెక్టర్ రామగిడ్డయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి ఈనెల 17 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు ఫారం పూర్తి చేసి కడప పాత రిమ్స్ లోని ప్రాంతీయ సంచాలకుల కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుందన్నారు. ఇతర వివరాలకు https: //cfw. ap. gov. in/ సంప్రదించాలన్నారు.