రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా యోగివేమన విద్యాలయంలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఆర్ట్స్ బ్లాక్, గాంధీ పార్కు పరిసర ప్రాంతాల్లో వృధాగా ఉన్న పిచ్చి మొక్కలను, ప్లాస్టిక్ ను తొలగించారు. ఈ సందర్భంగా నీటి ఆవశ్యకత, పొదుపు, పరిమిత వినియోగం గురించి అధ్యాపకులు అవగాహన కల్పించారు.