కడప శివారులోని చెర్లోపల్లి లేఅవుట్ పేజ్ 3 ప్రాంతంలో రహదారి, స్మశానం, మంచినీటి సమస్యల పరిష్కారానికి సీపీఎం పార్టీ ఆందోళనకు సిద్ధమైంది. ఈ నెల 26న రాయచోటి రింగ్ రోడ్డులో ఆందోళన చేపడతామని సీపీఎం నేతలు ఆదివారం తెలిపారు. అధికారులు సమస్యలపై స్పందించకపోవడాన్ని ఖండించారు. 17 ఏళ్లుగా మౌలిక సదుపాయాలు లేవని, తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.