పాఠశాలల సందర్శన సమయంలో అధికార స్థాయిని మరచి నోటికి వచ్చినట్లు ఉపాధ్యాయుల పట్ల డిఇఓ వ్యవహరిస్తున్న తీరుకు నిరసన చేపట్టనున్నారు. కడప జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటలకు డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి పిఆర్టియు నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.