కడప జిల్లాలో జులైలో జరుగనున్న జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మా రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జెవివి జిల్లా అధ్యక్షులు ఆనంద్ అధ్యక్షతన జిల్లా స్థాయి విస్తృత సమావేశం గురజాడ స్కూలులో జరిగింది. ఈ సందర్భంగా బ్రాహ్మారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో జెవివి ఆధ్వర్యాన మ్డూ నమ్మకాలకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాష్ట్ర నాయకుడు కాలా సుధాకరరావు మాట్లాడుతూ రానురాను మనం తెలుగు బాషను మర్చి పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.