కడప: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదాం

67చూసినవారు
కడప: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదాం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడవ శనివారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర- స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని శనివారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని పోలీస్ సంక్షేమ ఆస్పత్రి ఆవరణలో నిర్వహించారు. జిల్లా ఎస్. పి అశోక్ కుమార్ మొక్కను నాటారు. భూమిపై కాలుష్యాన్ని తగ్గించేందుకు, ప్రాణవాయువు శాతాన్ని పెంచేందుకు, వర్షాలు పడేందుకు చెట్లు ఎంతగానో ఉపయోగపడ తాయని ఎస్పీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్