రాష్ట్రంలో 7 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు నష్టాలు, కష్టాలు తప్ప మేలు చేసిందేమీ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. శనివారం కడప వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేవలం ఫించన్లు పెంచడం తప్ప పథకాలు ప్రవేశ పెట్టలేదు, రూ. లక్ష కోట్లు అప్పు చేశారు తప్ప ప్రజలకు మంచి కార్యక్రమం ఒక్కటి చేయలేదన్నారు. ఆరోగ్యశ్రీని ప్రైవేటుపరం చేస్తున్నారని ఇది దారుణం అన్నారు.