నులి పురుగుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఫిబ్రవరి 10 తేదీన జిల్లాలో ఉన్న 1 నుంచి 19 సంవత్సరాల వయసులోపు పిల్లలందరికీ నులి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేయాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ అధికారులకు సూచించారు. శుక్రవారం కడప కలెక్టరేట్ లో నులి పురుగుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వైద్య అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.