వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని కడప జైలులో బెదిరించటం, ప్రలోభపెట్టడం వంటి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ అధికారిగా రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ నియమిస్తూ ఆదేశించింది. శుక్రవారం కడప జైలులో దస్తగిరిని విచారణ అధికారి ప్రశ్నించి, అనంతరం చైతన్యరెడ్డి, ప్రకాశ్‌రెడ్డిని విచారణకు పిలవనున్నారు. శుక్రవారం, శనివారం కడప జైలులో విచారణ కొనసాగనుందని సమాచారం.