కడప నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే మాధవి అన్నారు. గురువారం కడప నగరంలోని ద్వారకా నగర్ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ ను ఎమ్మెల్యే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల నుండి వినతులు స్వీకరించి వారి సమస్యలను విన్నారు. సమస్యల పరిష్కారం కోసం సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.